News February 11, 2025
పదీ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 10,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు. పరీక్ష కేంద్రాల ద్వారా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
Similar News
News March 17, 2025
నల్గొండ: వచ్చే నెల నుంచే సన్న బియ్యం: మంత్రి ఉత్తమ్

తుంగతుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుంది అన్నారు. వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని, కాంగ్రెస్ మాటలు చెప్పేది కాదు, చేతల్లో చూపెడుతుందని అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయబోతున్నామని అన్నారు.
News March 17, 2025
మార్చి17: చరిత్రలో ఈరోజు

*1892 : తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం.
*1896 : నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత మహిళ కల్పనా చావ్లా జననం
*1990: బాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం
News March 17, 2025
కాచిగూడ: ‘దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలి’

దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలో రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో బీసీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దేశ జనాభాలో 60శాతనికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.