News February 11, 2025

పదేళ్ల అభివృద్ధి ఏడాదిలో జరిగింది : మంత్రి సురేఖ

image

గ‌త పదేళ్లలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ ఏడాది పాలనలో జరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సోమవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సహచర మంత్రులతో కలిసి కొండా సురేఖ పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండర్‌ను అమలు చేశామన్నారు.

Similar News

News February 12, 2026

బడిపిల్లల కథలకు ఆహ్వానం: డీఈఓ యాదయ్య

image

విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు వారు రాసిన కథలను ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు నైతిక, మానవ విలువలు, నీతి, నిజాయితీ వంటి అంశాలతో కూడిన తమకు నచ్చిన అంశంపై ఒక పేజీకి మించకుండా తెలుగు లేదా ఇంగ్లిష్‌లో కథలు రాసి పంపాలని సూచించారు. మంచి కథలను ఎంపిక చేసి మార్చి మొదటివారంలో పుస్తకంగా వెలువరిస్తామన్నారు.

News February 12, 2026

బిల్డర్లకు సాయం తప్ప రెరాలు చేసేదేమీ లేదు: CJI

image

రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా)లపై SC కీలక వ్యాఖ్యలు చేసింది. డిఫాల్టర్లయ్యే బిల్డర్లకు సాయపడడం తప్ప అవేమీ చేయడం లేదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. వీటిని రద్దు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. అసలు దీనిని ఎందుకు తీసుకొచ్చారో ప్రభుత్వాలు ఆలోచన చేయాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ రెరా ఆఫీసును సిమ్లా నుంచి ధర్మశాలకు తరలించడానికి సంబంధించిన కేసులో చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News February 12, 2026

పార్లమెంట్‌లో ఏపీ అభివృద్ధిపై ‘సానా, ఉదయ్’ ప్రశ్నలు

image

కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ పార్లమెంట్ వేదికగా ఏపీ అభివృద్ధి కోసం పోటీపడుతున్నారు. వీరిద్దరూ కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ సమస్యలపై నిత్యం గళమెత్తుతూ, వివిధ ప్రశ్నల సందిస్తున్నారు. అభివృద్ధి విషయంలో వీరిద్దరిదే పైచేయిగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉభయ సభల్లోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వీరు సాగిస్తున్న పోరాటం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.