News March 8, 2025

పదో తరగతి పరీక్షలను పక్కడ్బందీగా నిర్వహించండి: అదనపు కలెక్టర్

image

మార్చి 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. 6,853మంది విద్యార్థులు 36 పరీక్ష కేంద్రాలలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

Similar News

News January 21, 2026

నెల్లూరులో ఎర్రబంగారం పట్టుబడేది కొంచెమేనా..?

image

నెల్లూరు జిల్లాలో అపారమైన ఎర్ర చందనం ఉంది. అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఎర్ర బంగారాన్ని జిల్లా దాటిచేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం.. 2022 నుంచి 2025 వరకు 29,851 కేజీల దుంగలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.78 కోట్లగా ఉంది. తాజాగా ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఏది ఏమైనప్పటికీ పట్టుబడిన ఎర్రచందనం కంటే ఐదారు రెట్లు దేశం దాటిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

News January 21, 2026

ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

image

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ పరీక్షల కోసం 5నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఏదైనా డిగ్రీతో కుటుంబ ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారు అర్హులు. దరఖాస్తులు ఈనెల 30 వరకు http://tsstudycircle.co.in ద్వారా స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 8న నిర్వహించనున్నారు.

News January 21, 2026

మద్దిరాల: రోడ్డు ప్రమాదంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని మద్దిరాల తహశీల్దార్ కార్యాలయ రికార్డు అసిస్టెంట్‌ రాజేష్‌(22) దుర్మరణం చెందారు. ఎస్‌ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కుంటపల్లి నుంచి మద్దిరాల వస్తుండగా రాజేష్ బైక్‌ను వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.