News October 8, 2025
పదో తరగతి విద్యార్థులతో అదనపు కలెక్టర్ రాధిక గుప్తా

కూకట్‌పల్లి ZPHSను DEO విజయకుమారితో కలిసి మేడ్చల్ అదనపు కలెక్టర్ రాధికగుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ఇంటరాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఈఓ సీహెచ్ఎంలకు నిర్వహిస్తున్న సపోర్టివ్ సూపర్వైజర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. విద్యా విధానాన్ని మెరుగుపరుస్తున్నామన్నారు.
Similar News
News January 21, 2026
రాష్ట్రంలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌లు

తెలంగాణలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.
News January 21, 2026
VJA: మహిళ వేషం ధరించి చోరీ.. నిందితుడి అరెస్ట్

మహిళ వేషం ధరించి బంగారం చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కండ్రికకు చెందిన ఓ వృద్ధురాలని అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి మహిళ వస్త్రాలు ధరించి బంగారం సోమవారం చోరీ చేశాడు. ఈ ఘటనపై సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేసినట్లు నున్న సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అతని వద్ద నుంచి బంగారం లాకెట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News January 21, 2026
జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.


