News April 1, 2024

పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్‌ను పరిశీలించిన డీఈఓ

image

అనంతపురంలోని కేఎస్ఆర్ గవర్నమెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను సోమవారం డీఈఓ బీ.వరలక్ష్మి, ఏసీ గోవింద నాయక్ కలిసి పరిశీలించారు. స్పాట్‌లో పాటించవలసిన నియమ నిబంధనలను సరిగా పాటిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించారు. విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 13, 2026

ఈనెల 15 నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ కింద మెటీరియల్ పేమెంట్లను ఈనెల 15 నాటికి రూ.22.68 కోట్ల మేర పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు ఆదేశించారు. రోజుకు సుమారు రూ.7.35 కోట్ల పనులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెలవు దినాలైనా సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పాత పనులు పూర్తిచేసి పేమెంట్లు క్లియర్ చేయాలన్నారు.

News February 13, 2026

ఈ నెల 17న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

image

అనంతపురం జిల్లాలో ఫిబ్రవరి 17న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. 1-19 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. 1-2 ఏళ్ల వారికి సగం మాత్ర, 2-19 ఏళ్ల వారికి 400 మి.గ్రా మాత్ర భోజనం తర్వాత ఇవ్వాలన్నారు. మిస్ అయిన వారికి ఫిబ్రవరి 24న మాప్-అప్ నిర్వహించనున్నారు.

News February 13, 2026

‘అనంత బాలోత్సవం’ బ్రోచర్ ఆవిష్కరణ

image

అనంతపురంలోని SSBN కళాశాలలో ఈనెల 21, 22వ తేదీల్లో జరగనున్న ‘6వ అనంత బాలోత్సవం’ పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబు ఆవిష్కరించారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.