News January 31, 2025

పద్మశ్రీ కనకరాజు సంతాపసభలో పాల్గొన్న సీతక్క

image

జైనూర్ మండలంలోని మార్లవాయిలో గురువారం పద్మశ్రీ, గుస్సాడీ కళాకారుడు కనకరాజు సంతాప సభలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క పాల్గొన్నారు. కనకరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవేదికలపై పరిచయం చేసిన కనకరాజు సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆమె వెంట ఎమ్మెల్సీ దండే విఠల్, పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఆత్రం సుగుణ తదితరులున్నారు.

Similar News

News February 16, 2025

MBNR: నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం.!

image

అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన MBNR పట్టణంలో శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని తన ఇంట్లోకి తీసుకొని అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా.. చిన్నారి తల్లి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 16, 2025

నా పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆయా ఫేస్బుక్ ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ పేరుతో, ఫొటోలతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామన్నారు.

News February 16, 2025

రేపు భారత్‌కు ఖతర్ అమీర్

image

ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్-థనీ రేపు, ఎల్లుండి భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు అమీర్ భారత్‌కు వస్తున్నారని.. రాష్ట్రపతి, PM మోదీతో ఆయన భేటీ అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై ఈ పర్యటనలో చర్చలు జరుగుతాయని పేర్కొంది. 2015 మార్చిలో ఆయన తొలిసారి భారత్‌లో పర్యటించగా ఇది రెండో పర్యటన అని వెల్లడించింది.

error: Content is protected !!