News August 13, 2025
పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేస్తాం: కలెక్టర్

ఏలూరు జిల్లాలో రీ సర్వే పనులను వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు తెలిపారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. రీ సర్వే, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలపై చర్చించారు. నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 13, 2026
భీమేశ్వరుడికి కానుకల వర్షం.. హుండీ ఆదాయం ఎంతంటే?

వేములవాడ శ్రీభీమేశ్వర స్వామి ఆలయ ఖజానాకు హుండీ ద్వారా రెండు కోట్ల పదహారు లక్షలకు పైచిలుకు ఆదాయం సమకూరింది. గత 33 రోజుల కాలంలో హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం పటిష్ఠమైన బందోబస్తు మధ్య లెక్కించారు. ఈ సందర్భంగా 2,16,65,140/- నగదు, 161 గ్రాముల మిశ్రమ బంగారం, 10 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
News March 13, 2026
పాలమూరు: కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. తండ్రి మృతి

మక్తల్ పట్టణంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీపు డ్రైవర్ చెన్నారెడ్డి మృతి చెందాడు. దండు ప్రాంతానికి చెందిన చెన్నారెడ్డి తన అనారోగ్యంతో ఉన్న కుమారుడు అభినందన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డా కుమారుడిని ఆసుపత్రికి తరలించారు.
News March 13, 2026
విషాదం.. సాఫ్ట్‌వేర్ దంపతుల దుర్మరణం

ఆదోని నుంచి బెంగళూరుకు కారులో వెళ్తున్న దంపతులను మృత్యువు వెంటాడింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అనురాగ్, ఐశ్వర్య దుర్మరణం చెందారు. కర్ణాటక సరిహద్దులో జరిగిన ఈ ఘటనలో ఐశ్వర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అనురాగ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. బెంగళూరులో సొంతిల్లు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్న దంపతుల మృతితో ఆదోని తిరుమలనగర్‌లో విషాదం అలుముకుంది.


