News November 27, 2024
పరవాడ ఘటనపై దర్యాప్తునకు అనకాపల్లి కలెక్టర్ ఆదేశం
పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మంగళవారం రాత్రి లిక్విడ్ లీకేజ్ వల్ల 9 మంది కార్మికులు శ్వాస, దగ్గుతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. వీరిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఒడిశాకు చెందిన హెల్పర్ అమిత్ బుధవారం మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు. ఇద్దరికి వెంటిలెటర్ చికిత్స జరుగుతుందన్నారు.
Similar News
News December 2, 2024
విశాఖలో ఈనెల 30న పోస్టల్ అదాలత్ నిర్వహణ
పోస్టల్ డాక్/పెన్షన్ అదాలత్‌ను ఈ నెల 30న ఉదయం 11.00 గంటలకు ఎంవీపీ కాలనీలోని పోస్టల్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ భవనంలో నిర్వహించనున్నట్లు ఆర్.ఎం.ఎస్. -వి- డివిజన్ సూపరింటెండెంట్ ప్రసన్నరెడ్డి తెలిపారు. ఆర్.ఎం.ఎస్.(రైల్వే మెయిల్ సర్వీసెస్) -వి- డివిజన్ పరిధిలోని ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన తపాలా సేవలు, పింఛన్లపై ఫిర్యాదులు 23 వరకు స్వీకరిస్తారు.
News December 2, 2024
విశాఖలో 9 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు..!
ఏపీలో జిల్లాల వారీగా మొత్తం 34 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 9 ఆర్థిక మండలాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరవాడ మండలం ఈ.బోనంగి, విశాఖ గ్రామీణ ప్రాంతం మధురవాడ, రేసపువానిపాలెం, నక్కపల్లి మండలం, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలు, జి.కోడూరు ప్రాంతాలు ఉన్నాయి.
News December 2, 2024
సెలబ్రిటీలను మోసం చేసిన విశాఖ యువకుడు
సెలబ్రిటీలను మోసం చేసిన కేసులో విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్(24)ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. 10th ఫెయిలైన అతను ఈవెంట్స్ సంస్థను నెలకొల్పి సెలబ్రెటీలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం తన వ్యాపారాల్లో సెలబ్రెటీలు పెట్టుబడులు పెడుతున్నారని నమ్మించి పలువురి వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశాడు. జ్యూవెలర్స్‌లో పెట్టుబడుల పేరుతో తనను మోసం చేశాడని శ్రీజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు.