News November 7, 2025
పరవాడ: మాక్ అసెంబ్లీకి ఎంపికైన పరవాడ విద్యార్థిని

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న హరిత ఎంపికైంది. అనకాపల్లిలో నిర్వహించిన వక్తృత్వ వ్యాసరచన క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన హరిత మాక్ అసెంబ్లీకి ఎంపికైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మద్దిలి వినోద్ బాబు శుక్రవారం తెలిపారు. హరితకు కళాశాల అధ్యాపకులు అభినందించారు.
Similar News
News January 23, 2026
బీపీ తగ్గాలంటే ఇవి తినాలి

ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని బీపీ ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల హైబీపీని తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ఆకుకూరలు, అరటి పళ్లు, ఓట్స్, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, సాల్మన్, మాకేరెల్ చేపలను తీసుకోవాలి. అలాగే సాసేజ్, ప్రాసెస్ చేసిన మాంసం, సోడాలు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, నిల్వ పచ్చళ్లు, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News January 23, 2026
ఏలూరులో గోదావరి పుష్కరాలపై కలెక్టర్ కీలక సమీక్ష

రామన్న గోదావరి పుష్కరాల్లో ఏలూరు జిల్లాలో సుమారు 50 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులు ఆదేశించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయన్నారు.
News January 23, 2026
NRPT: ‘ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకం’

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఆర్వోల పాత్ర కీలకం అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నారాయణపేట, మద్దూరు మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్వో, ఏఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లతో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ ప్రక్రియతో మొదలుకొని పోలింగ్, ఓట్ల లెక్కింపు అన్ని నిబంధనల మేరకు నిర్వహించాలని అన్నారు.


