News April 1, 2024

పరవాడ: మాజీ మంత్రి బండారుతో సీఎం రమేశ్ భేటీ

image

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తితో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ భేటీ అయ్యారు. పరవాడ మండలం వెన్నెల పాలెంలో బండారు స్వగృహానికి సీఎం రమేశ్, పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేశ్ బాబు, అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్ వెళ్లారు. సీఎం రమేశ్ కొద్దిసేపు ఆయనతో చర్చించారు. తర్వాత పంచకర్ల కలవగా అనారోగ్యంగా ఉందని తర్వాత మాట్లాడదామని చెప్పినట్లు తెలిసింది.

Similar News

News February 17, 2026

విశాఖలో పర్యాటక ప్రాంతాల పాక్షిక మూసివేత

image

అంతర్జాతీయ నౌకాదళ (IFR-2026) విన్యాసాల దృష్ట్యా విశాఖలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలపై VMRDA ఆంక్షలు విధించింది. కైలాసగిరి, సబ్‌మెరైన్, సీ-హారియర్ మ్యూజియంలు ఈ నెల 19వ తేదీ వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ఉండవన్నారు. అంతర్జాతీయ ప్రతినిధుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News February 17, 2026

విశాఖ: లక్ష్యాన్ని మించిన కస్టమ్స్ వసూళ్లు

image

2024-25 ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్‌కు రూ.13,207.85 కోట్ల ఆదాయం లభించింది. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం-2026 సందర్భంగా విశాఖపట్నం కస్టమ్స్ కమిషనరేట్ నిర్వహించిన ఆదాయ వసూళ్లపై అధికారులు వివరాలు వెల్లడించారు. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి 2026 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న రూ.11,958.08 కోట్లను మించి ఇప్పటికే రూ.12,891.42 కోట్లు వసూలు చేసిందన్నారు.

News February 17, 2026

ఈనెల 21న విశాఖ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

image

విశాఖ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈనెల 21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 1 నుండి 7 వరకు గల స్థాయీ సంఘాల సమావేశాలు వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తామని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు సంబంధిత శాఖల అధికారులు ప్రగతి నివేదికలతో ఈ సమావేశాలకు హాజరుకావాలని ఆయన కోరారు.