News May 7, 2025
పరిగి: ఎదురెదురుగా బైకులు ఢీకొని ఒకరి మృతి

దోమ మండలంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని లింగన్‌పల్లికి చెందిన నాగని దస్తయ్య(40) బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. దిర్సంపల్లికి చెందిన శ్రీనివాస్, రమేశ్ మరో బైక్ పై పాలేపల్లి నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో రెండు బైకులు ఢీకోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పరిగి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దస్తయ్య మృతి చెందాడు.
Similar News
News February 18, 2026
పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలి: కలెక్టర్ స్నేహ శబరీష్

జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో ఇంటర్, 64 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు.
News February 18, 2026
పంచాయతీల్లో ఓటుహక్కు నమోదు ఇకపై ఏడాదికి 4సార్లు

AP: పంచాయతీల్లో ఓటుహక్కు నమోదు ఏడాదికి 4సార్లు నిర్వహించేలా చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పటివరకు JAN 1న మాత్రమే ఓటరు నమోదు జరుగుతోంది. తరువాత పుట్టిన వారు ఏడాది పాటు వేచి ఉంటున్నారు. ఈ బిల్లుతో ఇకపై JAN, APR, JUL, OCT నెలల్లో 1న ఓటు నమోదు చేసేలా చట్టాన్ని సవరించారు. మంత్రి కందుల దుర్గేశ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ, మున్సిపల్ ఓట్ల నమోదు కూడా ఏటా 4సార్లు చేస్తున్నారు.
News February 18, 2026
VZM: ‘సివిల్ తగాదాలను ఇరు పక్షాలతో కౌన్సిలింగ్ చేసి పరిష్కరించాలి’

రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చే సివిల్ తగాదాల్లో ఇరు పక్షాలను పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రీ సర్వే 4వ దశలో గ్రౌండ్ ట్రూతింగ్ మార్చి 15 నాటికి పూర్తి చేసి, ఏప్రిల్ 11 నాటికి లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.


