News August 28, 2024

పరిశ్రమల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలి: కలెక్టర్

image

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జిల్లాస్ధాయి క్రైసెస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు పూర్తి భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. ఏవైనా ఘటనలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై అవగాహన కలిగించాలన్నారు.

Similar News

News September 19, 2024

ఏలూరు: కాలువలో దిగి బాలుడు మృతి

image

ఏలూరులో ఓ బాలుడు ఆడుకుంటూ కాలువలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. పట్టణంలోని గ్జేవియర్ నగర్‌కు చెందిన బాలవిజ్ఞేశ్ బుధవారం ఇంటి సమీపంలో ఉన్న ఏటిగట్టున సోదరితో కలిసి ఆడుకుంటూ కాలువలోకి దిగాడు. చిన్నారి మునిగిపోవడం చూసిన సోదరి కేకలు వేయగా స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాలుడిని వెలికితీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News September 19, 2024

గుండెపోటుతో ఏలూరు సీసీఎస్ ఎస్సై మృతి

image

ఏలూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న డి.నరసింహారావు గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. ఏలూరుకు చెందిన ఆయన స్థానిక సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News September 19, 2024

రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉద్యాన వర్సిటీ వీసీ

image

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ డా.గోపాల్ బుధవారం రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, సాధించిన పురోగతిని గవర్నర్‌కు వివరించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ డా.శ్రీనివాసులు ఉన్నారు.