News September 13, 2024
పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.3.07కోట్లు మంజూరు
జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీలు కింద రూ.3.07కోట్లు మంజూరు చేయడం జరిగిందని ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని శుక్రవారం వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించారు. సింగిల్ విండో పథకం కింద అనుమతులను కాలయాపన లేకుండా మంజూరు చేయాలని ఆదేశించారు. ఓఎన్‌డీసీ ప్లాట్ ఫామ్‌లో అన్ని ఎంఎస్ఎంఈ యూనిట్లు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.
Similar News
News October 5, 2024
ఉపాధ్యాయులను వైసీపీ అగౌరవంగా చూసింది: మంత్రి నిమ్మల
ఉపాధ్యాయులను గత వైసీపీ ప్రభుత్వం అగౌరవంగా చూస్తే, నేటి కూటమి ప్రభుత్వం గౌరవిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో ధర్మారావు ఫౌండేషన్ తరఫున 125 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రామచంద్ర గార్డెన్స్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులను వైన్ షాపులు వద్ద కాపలా పెట్టారన్నారు.
News October 5, 2024
నరసాపురం: రాజేంద్రప్రసాద్ నాకు అన్న: మధుబాబు
తెలుగు సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి మృతి బాధాకరమని నరసాపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మధుబాబు అన్నారు. శనివారం గాయత్రి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ తను అన్నలాంటి వారిని, తమ కుటుంబాల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. గతంలో రాజేంద్రప్రసాద్, గాయత్రి, నటి కీర్తి సురేష్ తో ఉన్న ఫోటోలను మీడియాతో పంచుకున్నారు. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
News October 5, 2024
APIIC ఛైర్మన్‌గా మంతెన రామరాజు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (APIIC) ఛైర్మన్‌గా మంతెన రామరాజు శనివారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని రామరాజు ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన్ను వారు అభినందించారు.