News March 5, 2025

పరీక్షలు సజావుగా జరిపించాలి: ములుగు కలెక్టర్

image

ములుగులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ దివాకర టిఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీసీ కెమెరా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్షలు నిర్వహిస్తున్నారా? నిర్ణీత సమయంలో ప్రశ్నా పత్రాలను తెరిచారా? లేదా అని పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలన్నారు.

Similar News

News December 12, 2025

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

*గద్వాల- నవోదయ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్
* గద్వాల్ జిల్లాలో 4 కేంద్రాలు ఏర్పాటు
*రెండో విడతలో 1.34 లక్షల మంది ఓటర్లు
*రెండోవిడత ఎన్నికలకు సిబ్బంది కేటాయింపు
*అయిజ- మున్సిపాలిటీలో వార్డులు పెంచాలి
*మల్దకల్- ఓటు హక్కు పై అవగాహన
*అలంపూర్- ఆలయంలో సామూహిక చండీ హోమం
*ఎర్రవల్లి- ప్రచారంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
*రాజోలి- భార్యను తీసుకువచ్చేందుకు వెళ్లి భర్త మృతి

News December 12, 2025

ఎన్నికల విధులకు డుమ్మా.. 15 మందిపై చర్యలు

image

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 15 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. తుంగతుర్తిలో 8, ఆత్మకూరు (ఎస్)లో 7 మంది విధులకు డుమ్మా కొట్టారని ఆయన వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు.

News December 12, 2025

HYD: మెస్సీ మ్యాచ్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు!

image

రేపు HYD పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ వైపు నుంచి ఉప్పల్ మీదుగా HYD, SEC వెళ్లే వాహనాలు, ఘట్కేసర్ వద్ద ORR మీదుగా అబ్దుల్లాపూర్మెట్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే HYD నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లాలనుకునే వారు ఎల్బీనగర్, హయత్‌నగర్, మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ORR మీదుగా వరంగల్ వెళ్లాల్సిందిగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.