News March 17, 2025

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమలు చేయాలి: BHPL కలెక్టర్

image

పదవ తరగతి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా రూట్లు వారిగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆర్టీసీ సీఎంకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు.

Similar News

News April 20, 2025

నిజామాబాద్: గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

image

నందిపేట్ మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్ ఫిర్యాదుపై నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య స్పందించారు. గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి చీటింగ్, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి పలు గ్రామాలకు చెందిన సుమారు 80 మందిని ముఠా సభ్యులు మోసం చేసినట్లుగా గుర్తించినట్లు సీపీ పేర్కొన్నారు.

News April 20, 2025

ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

image

✒ 1889: జర్మనీ నియంత హిట్లర్ జననం
✒ 1950: ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
✒ 1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
✒ 1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
✒ 1972: సినీ నటి అంజలా జవేరీ జననం
✒ 1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం

News April 20, 2025

ఏం తప్పు చేశామో తెలియట్లేదు: పరాగ్

image

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం బాధ కలిగించిందని RR కెప్టెన్ రియాన్ పరాగ్ చెప్పారు. ‘మేం ఏం తప్పు చేశామో తెలియట్లేదు. 18-19 ఓవర్ వరకు మాదే గెలుపు అనుకున్నాం. 19 ఓవర్లోనే మ్యాచ్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఓటమికి నాదే బాధ్యత. అలాగే మా బౌలింగ్‌లో చివరి ఓవర్ సందీప్ శర్మ ఎక్కువ రన్స్ ఇచ్చారు. అతను మంచి బౌలరే కానీ అతని బ్యాడ్ లక్. సమద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!