News May 14, 2024

పర్చూరు: తనకు తాను ఓటేసుకోని YCP MLA అభ్యర్థి

image

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ తను పోటీ చేసిన పర్చూరు నియోజకవర్గంలో ఓటు వేయడానికి అవకాశం లేకపోయింది. స్వగ్రామమైన చీరాలలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పర్చూరు నియోజకవర్గ వైసీపీ టికెట్ ఆయనకు ఖరారవడంతో ఆయన ఓటును పర్చూరుకి మార్చుకునే అవకాశం లేకపోయింది. కాగా కూటమి తరఫున పర్చూరులో ఏలూరి సాంబశివరావు పోటీలో ఉన్నారు.

Similar News

News December 12, 2025

ఒంగోలు: పెళ్లి పేరుతో మోసం.. పదేళ్ల జైలుశిక్ష

image

పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష, రూ.12వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వఅదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. హెచ్ఎంపాడు మండలానికి చెందిన రవి ఓ యువతిని నమ్మించి మోసం చేసినట్లుగా 2018లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో రవికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

News December 12, 2025

ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రూ.10 కోట్లతో పనులు

image

ఒంగోలు రిమ్స్ వైద్యశాల అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కలెక్టర్ రాజబాబు వెల్లడించారు. ఆసుపత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News December 12, 2025

ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలు సూసైడ్.!

image

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంతరపల్లికి చెందిన ఈ దంపతులు 5 నెలలక్రితం అదృశ్యమయ్యారు. అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.