News August 21, 2025
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను వాడి వాటిని ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యతగా చేయూతను అందిద్దామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి విశిష్ట తను కాపాడేందుకు మనమందరం సమిష్ఠిగా కృషిచేయడం వల్ల ఒక గొప్ప మార్పును సాధించవచ్చన్నారు. సహజ రంగులతో మట్టి విగ్రహాలను తయారు చేయడం స్వచ్ఛతకు చిహ్నమన్నారు.
Similar News
News January 22, 2026
ఒక్క ఫొటో… కడప అంటే మతాలకు అతీతం.! ❤️

కడప నగరంలో జరుగుతున్న శ్రీరాముని శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారి పొడవున విచ్చేస్తున్న వందలాది మంది ప్రజలకు అన్న పానీయాలు అందజేస్తున్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలకు అన్నప్రసాదాలను అందిస్తూ వారి భక్తిని చాటుకుంటున్నారు. అప్సర సర్కిల్ సమీపంలోని ఓ కళాశాల వద్ద ముస్లిం విద్యార్థులు రాముని శోభాయాత్రలో భక్తులకు పానకం, వడపప్పు అందిస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.
News January 22, 2026
జాతీయ స్థాయి ఇస్తేమాకు భారీ భద్రత: కడప ఎస్పీ

కడప నగర శివార్లలోని కొప్పర్తి పరిసర ప్రాంతాలలో ఈనెల 23, 24, 25 తేదీలలో నిర్వహించనున్న ఇస్తేమా కార్యక్రమానికి భారీ బందోబస్తును ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షణలో పోలీసు శాఖ నిర్వహించనుంది. 6 మంది డీఎస్పీలు, 32 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, ఇంకా ఇతర సిబ్బందితో కలిపి 700 మంది మన జిల్లాకు సంబంధించిన వారు బందోబస్తు విధులను నిర్వహించనున్నారు. ఇంకా పక్క జిల్లాల నుంచి బందోబస్తుకు రానున్నారు.
News January 22, 2026
కడప: ‘ఇసుక రీచులు, స్టాక్ పాయింట్లపై పర్యవేక్షణ’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియ సజావుగా జరగాలని, ఇసుక రీచులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత, నూతన ఇసుక రీచ్‌ల గుర్తింపు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి సాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు.


