News November 30, 2025

పర్వతగిరి: నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పరిశీలన..!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు చేపట్టిన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర బీసీ కమిషనర్ బాలమాయ దేవి పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, నియమ నిబంధనలను పారదర్శకంగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతి దశను నిష్పక్షపాతంగా చేపట్టాలన్నారు. ఇండస్ట్రియల్ జీఎం నరసింహమూర్తి ఎంపీడీవో శంకర్ పాల్గొన్నారు.

Similar News

News February 11, 2026

వరంగల్ జిల్లాలో 85.42శాతం పోలింగ్

image

వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వర్ధన్నపేట, నర్సంపేట పట్టణాల్లో ఎన్నికలు జరగగా మొత్తం 85.42శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో 51,494 ఓట్లకు గాను 43,985 మంది ఓటు వేశారు. ఇందులో వర్ధన్నపేటలో 86.23శాతం, నర్సంపేటలో 85.21శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా జిల్లాలో 84.93శాతం పురుషులు, 85.87శాతం మహిళలు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News February 11, 2026

వరంగల్: ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 2న ప్రారంభమైన ఈ పరీక్షలు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. చివరి రోజున జిల్లా వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపక బృందాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

News February 11, 2026

WGL: 9 గంటల వరకు 12.44 శాతం పోలింగ్

image

వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో తొలి రెండు గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 12.44 శాతం ఓటింగ్ నమోదైంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 13.02 శాతంతో ఓటర్లు చైతన్యం చూపగా, నర్సంపేటలో 12.29 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.