News April 30, 2024
పలాసలో వడదెబ్బతో వ్యక్తి మృతి

మండలంలోని బ్రాహ్మణతర్ల- కేదారిపురం గ్రామాలకు వెళ్లే రహదారి పక్కన పొలంలో మంగళవారం ఓ వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎండకు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టెక్కలిలోనూ మరో వ్యక్తి వడ దెబ్బతో మృతి చెందారు. స్థానికులు చుట్టు పక్కల గ్రామస్థులకు సమాచారం అందించారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కుటుంబ సభ్యులకు తెలపాలని కోరారు.
Similar News
News December 13, 2025
కంచిలి: రైలు ఢీకొని టెన్త్ విద్యార్థిని మృతి

కంచిలి మండలంలో గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంచిలి పట్టణం బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.
News December 13, 2025
పొందూరు బ్రాండ్.. అద్భుత ట్రెండ్!

మహాత్మాగాంధీ నుంచి ప్రస్తుత ప్రముఖుల మనసుదోచుకున్న వస్త్రం పొందూరు ఖాదీ. ఎండతాపం నుంచి ఉపశమనం, చల్లదనాన్ని ఇవ్వడం ఈ వస్త్రం ప్రత్యేకత. ఇంతటి ఖ్యాతి గడించిన ఖద్ధరకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ నిన్న అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ కీర్తి వచ్చేలా కేంద్రమంత్రి రామ్మోనాయుడు కృషి చేయడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 13, 2025
SKLM: ‘యూరియా నిల్వలను రైతులు వినియోగించుకోండి’

ప్రస్తుత రబీ పంటకు సంబంధించిన మొక్కజొన్న, వరి, ఇతర పంటలకు అవసరమైన యూరియాను జిల్లాకు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాథ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట విస్తీర్ణాన్ని బట్టి మండలాల్లోని రైతు సేవా కేంద్రాలు (ఆర్బీకేలు), పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు కొరత లేకుండా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 2379 యూరియా నిల్వ ఉందన్నారు.


