News December 3, 2025

పల్నాడులో టీడీపీ-వైసీపీ సవాళ్లు.!

image

పల్నాడులో టీడీపీ, వైసీపీల మధ్య ప్రారంభమైన సవాల్, ప్రతి సవాళ్లు కాసు, జూలకంటి కుటుంబాల మధ్య రాజకీయ యుద్ధంగా మారింది. కాసు కుటుంబం 90 ఏళ్లుగా పల్నాడు అభివృద్ధికి కృషి చేసిందని మహేశ్ రెడ్డి పేర్కొనగా, జూలకంటి కుటుంబంలో తన తండ్రి, తల్లి, తనతో సహా ముగ్గురిని ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించారని బ్రహ్మారెడ్డి ప్రకటించారు. పల్నాడు అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ ఇద్దరు నేతలు సవాల్ విసిరారు.

Similar News

News February 18, 2026

నిర్మల్ జిల్లాలో ఎల్లుండి సెలవు

image

ఫిబ్రవరి 20న నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటించారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దానికి బదులు మార్చి 14 (రెండో శనివారం)ను పని దినంగా ఉంటుందన్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

News February 18, 2026

నమీబియాపై ఘన విజయం.. సూపర్-8కి పాక్

image

T20WC: నమీబియాపై పాకిస్థాన్ 102 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ సూపర్-8కి అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో 199/3 రన్స్ చేసింది. ఓపెనర్ ఫర్హాన్ సెంచరీ (58 బంతుల్లో 100)తో రాణించారు. అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. కాగా సూపర్-8లో పాకిస్థాన్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకలతో తలపడనుంది.

News February 18, 2026

సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు

image

తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో వెళ్తున్న బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో పర్యాటకులు భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును పంపి పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. నిత్యం బోట్ల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.