News September 13, 2025

పల్నాడులో ప్రకంపనలు రేపుతున్న భూ కుంభకోణం

image

పల్నాడు జిల్లా గురజాలలో సుమారు 1330 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద ఆన్‌లైన్ చేయబడింది. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ అక్రమాలకు 2019-24 వరకు గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ కోసం సెప్టెంబర్ 18న పొందుగల సచివాలయంలో ఎంక్వయిరీ సభ నిర్వహించనున్నారు.

Similar News

News December 12, 2025

చిలగడదుంపలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

image

శీతాకాలంలో దొరికే చిలగడదుంపలు పోషకాల పవర్ హౌస్ అని వైద్యులు చెబుతున్నారు. ‘వీటిలోని బీటా కెరోటిన్ కంటి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పెద్దమొత్తంలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. అలాగే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీర వాపులను, నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మనల్ని రక్షిస్తాయి’ అని అంటున్నారు.

News December 12, 2025

చివరి దశకు ‘పెద్ది’ షూటింగ్

image

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి HYDతో కొత్త షూటింగ్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వచ్చే నెల చివరికల్లా టాకీ పార్ట్ పూర్తవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ నుంచి రిలీజైన చికిరీ సాంగ్ ఇప్పటికే వ్యూస్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్ కానుంది.

News December 12, 2025

విశాఖ: SI ట్రైనింగ్ పూర్తయ్యినా పోస్టింగులు లేవు

image

ట్రైనింగ్ పూర్తిచేసుకున్న SIలకు పోస్టింగులు ఇవ్వకపోవడంపై విశాఖ రేంజ్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 4 రేంజ్‌లలో ఇప్పటికే పోస్టింగులు ఇచ్చినా.. విశాఖ రేంజ్‌కే జాప్యం కొనసాగుతోంది. డిసెంబర్ 5తో ట్రైనింగ్ పిరియడ్ పూర్తయింది. విశాఖ రేంజ్‌లో మొత్తం 49 మంది SIలకు ట్రైనింగ్ పూర్తైనా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. మరోపక్క నగరంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో లా అండ్ ఆర్డర్‌కు కష్టమౌతోంది.