News September 12, 2025

పల్నాడులో 14 నెలల విధులు నిర్వహించిన అరుణ్ బాబు

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా 14 నెలల పాటు పనిచేసిన పి. అరుణ్ బాబు బదిలీ అయ్యారు. ఆయన 2024 జులై 7న జిల్లా మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన పల్నాడు జిల్లాకు వచ్చారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్‌గా లోతేటి శివశంకర్ పనిచేశారు.

Similar News

News December 5, 2025

CM రేవంత్‌కు సోనియా అభినందన సందేశం

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్-2047 నాటికి రాష్ట్రం $1T ఆర్థికశక్తిగా ఎదగడంలో కీల‌కం కానుందని INC పార్ల‌మెంట‌రీ పార్టీ నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్నందుకు CM రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు. సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీల‌క‌ ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగ‌మయ్యే వారికి స‌మ్మిట్ మంచి వేదిక అని తన సందేశంలో పేర్కొన్నారు.

News December 5, 2025

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. సీఎంలకు మంత్రుల ఆహ్వానం

image

TG: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాపారవేత్తలతో పాటు పలు రాష్ట్రాల CMలకూ మంత్రులు ఆహ్వానం పలుకుతున్నారు. ఇవాళ AP CM చంద్రబాబును కోమటిరెడ్డి, TN CM స్టాలిన్‌ను ఉత్తమ్, ఝార్ఖండ్ CM హేమంత్‌ను భట్టి ఆహ్వానించారు. ‘CBN సీనియర్ నాయకుడు. ఆయన సలహా తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి’ అని కోమటిరెడ్డి చెప్పారు.

News December 5, 2025

ఆదిలాబాద్‌లో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలు

image

10వ తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ ఆదిలాబాద్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవికుమార్ తెలిపారు. ఈ నెల 7న జిల్లా స్థాయి, 8,9వ తేదీలలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయన్నారు. పోటీల్లో పాల్గొనే వారి వయస్సు ప్రకారం 5 గ్రూపులుగా విభజించినట్లు తెలిపారు.