News August 14, 2025
పల్నాడు కలెక్టర్ కీలక ప్రకటన

భారీ వర్షాల నేపథ్యంలో పల్నాడు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ అరుణ్ బాబు ఓ ప్రకటన ద్వారా కోరారు. వాగులు, వంకలు పొంగే అవకాశం ఉందన్నారు. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News March 13, 2026
RR: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. 53,058 విద్యార్థులు

పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 255 సెంటర్లు 1,024 పాఠశాలల నుంచి 53,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీకి పాల్పడకుండా సెట్టింగ్ స్క్వాయిడ్, ప్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.
News March 13, 2026
కడప: ఇవాళ్టి ఇంటర్ పరీక్షకు 276 మంది డుమ్మా

కడప జిల్లాలో శుక్రవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ ఫిజిక్స్ పేపర్-2 పరీక్షలు జరిగాయి. నేడు 12,141 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 11,865 మంది హాజరయ్యారు. 276 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News March 13, 2026
సంగారెడ్డి: SIR ప్రక్రియ వేగవంతం చేయాలి: సుదర్శన్ రెడ్డి

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పక్కాగా వివరాలు సేకరించేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.


