News March 5, 2025
పల్నాడు: ‘కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడిపై దాడి’

పల్నాడు జిల్లాకు బొలిసిపాడుకి చెందిన యువతి, ఏలూరుకి చెందిన దాడిశెట్టి మణికంఠ ఈ నెల 1వ తేదీన మణికంఠ కుటుంబ సభ్యుల సమక్షంలో ద్వారకా తిరుమలలో కులాంతర వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు సోమవారం రాత్రి తమ ఇంటిపై దాడి చేశారని మణికంఠ కుటుంబ సభ్యులు తెలిపారు. మణికంఠను కొట్టి యువతిని తీసుకువెళ్లినట్లు చెప్పారు. బాధితుడు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Similar News
News March 26, 2025
పార్వతీపురం నగరపాలక సంస్థ బకాయిదారులకు శుభవార్త

పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలం, ఇంటి స్థల పన్నులపై 50 శాతం వడ్డీ రాయితీని ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీనిని వన్ టైం సెటిల్మెంట్‌గా భావించి ఏక మొత్తంలో చెల్లించి 50% రాయితీ పొందవచ్చును అన్నారు. ఈనెల 31 వరకు మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు. సచివాలయాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో పన్నులు చెల్లించి తగు రసీదు పొందాలని సూచించారు.
News March 26, 2025
MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..
News March 26, 2025
MDK: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

ఎన్నో నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి వర్గంలోకి 4 లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉమ్మడి MDK జిల్లా నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోన్నట్లు సమాచారం. మరి మీ కామెంట్..