News November 19, 2025

పల్నాడు జిల్లాను పచ్చదనంతో నింపాలి: కలెక్టర్

image

జిల్లాను పచ్చదనంతో నింపి హరిత పల్నాడును ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వనం – మనం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అన్ని శాఖలు సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు, ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, లక్ష్యాలుపై నివేదిక సమర్పించాలన్నారు.

Similar News

News January 22, 2026

500 వికెట్లు.. జలజ్ సక్సేనా రికార్డు

image

మహారాష్ట్ర ప్లేయర్ జలజ్ సక్సేనా (39 Yrs) దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. పుణెలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నారు. అదే విధంగా 156 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7,202 పరుగులు సైతం చేశారు. జలజ్ కంటే ముందు ఫస్ట్ క్లాస్‌లో 18 మంది 500 వికెట్లు తీశారు.

News January 22, 2026

సిరివెళ్లలో రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి

image

సిరివెళ్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి ఫరూక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు.

News January 22, 2026

కడప జిల్లాలో పురాతన తెలుగు శాసనం గుర్తింపు

image

సిద్ధవటం మండలం టక్కోలి గ్రామానికి తూర్పు దిశగా ఉన్న శివాలయంలో మరో పురాతన తెలుగు శాసనాన్ని గుర్తించినట్లు దక్షిణ భారత పర్యాటక సంస్థ జిల్లా అధ్యక్షుడు జ్యోతి జార్జి, కార్య దర్శి శ్రీనివాసులు తెలిపారు. మాచుపల్లి శ్రీ రేణుకా ఎల్లమాంబ దేవాలయాన్ని దర్శించుకున్న వారు టక్కోలి గ్రామానికి చెందిన శివాలయంన్ని సందర్శించగా అక్కడ ప్రాచీన తెలుగు శాసనం ఉందన్నారు.