News October 6, 2025
పల్నాడు జిల్లాలో ఆ మండలం కలుస్తుందా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గంతో పాటుగా కందుకూరు ప్రకాశం జిల్లాలో కలపనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అలాగే పల్నాడు జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతమాగులూరు మండలాన్ని పల్నాడు జిల్లాలో కలపాలని చర్చ కూడా జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి.?
Similar News
News January 23, 2026
పీవీ సింధుపై సీఎంల ప్రశంసలు

ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదలను రేవంత్ కొనియాడారు. సింధు ఘనత దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 23, 2026
సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: ఖమ్మం అదనపు కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఓనర్లు, డీలర్లు, సేల్స్ అధికారులు, పంప్ ఆపరేటర్లకు సీపీఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. హార్ట్ ఎటాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చన్నారు. సీపీఆర్‌కు వైద్య అనుభవం అవసరం లేదని, సాధారణ ప్రజలు కూడా చేయవచ్చన్నారు.
News January 23, 2026
ORRపైకి యువతీ యువకులు.. కిక్కు కోసం కాదు!

నగర Gen-Z రూటే సపరేటు. ‘మత్తు’ కిక్కు కంటే భక్తిలో వచ్చే ‘హై’కే వీరు ఫిదా అవుతున్నారు. ORR సోలార్ ట్రాక్‌లపై స్మార్ట్‌వాచ్‌లతో హార్ట్-రేట్ సింక్ చేస్తూ భజన పాటలకు రన్నింగ్ చేస్తున్నారు. కీర్తనలకు తగినట్టు SMలో AR ఎఫెక్ట్స్‌తో రీల్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. IIIT-H, JNTU నుంచే వారానికి 7 వేల మంది గచ్చిబౌలి- నెక్లెస్ రోడ్ వరకు వెళ్తున్నారు. యువతలో ఒంటరితనాన్ని పోగొడుతూ, మహిళలకు భద్రతనిస్తోంది.


