News April 12, 2025

పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ నరసరావుపేట: జ్యోతిరావు పూలే కు కలెక్టర్ నివాళి☞ చిలకలూరిపేట: బైక్స్ దొంగ అరెస్ట్☞ సత్తనపల్లి వాగులో మృతదేహం లభ్యం☞ శావల్యాపురం: మహిళ ఖాతా నుంచి నగదు మాయం ☞ గురజాల డీఎస్పీ జగదీశ్ బదిలీ ☞ పిడుగురాళ్లలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య☞ వినుకొండ: రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి

Similar News

News January 18, 2026

ఏపీలో 424 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>EdCIL<<>> APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, MSc(సైకియాట్రిక్ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+రూ.4వేలు అలవెన్సులు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in/

News January 18, 2026

ఇంద్రకీలాద్రిపై వైభవంగా చండీ హోమం.. పోటెత్తిన భక్తులు!

image

అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో చండీ హోమాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. యాగశాలలో జరిగిన ఈ విశేష హోమంలో 233 మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనగా, 91 మంది పరోక్షంగా ఆన్‌లైన్ సేవ ద్వారా భాగస్వాములయ్యారు.

News January 18, 2026

HYD మెట్రో.. త్వరలో సీఎం ముందుకు ఫైనాన్స్ రిపోర్ట్..?

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకునే క్రమంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన ఆడిట్ పూర్తిచేసినట్లు సమాచారం. మరో పది రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను సీఎం వద్దకు పంపనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మెట్రో రైల్ హక్కుల స్వాధీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏదేమైనా ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని సర్కార్ భావిస్తోంది.