News September 13, 2025
పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు

పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా కృష్ణారావును పల్నాడుకు ప్రభుత్వం బదిలీ చేసింది. పలు కేసులలో సమర్థవంతంగా వ్యవహరించిన ఆయన ప్రభుత్వ మన్నన్నలు, ప్రజాభిమానం పొందారు. కాగా ప్రస్తుతం ఇప్పటివరకు పల్నాడు ఎస్పీగా పనిచేసిన కంచి శ్రీనివాసరావుకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
Similar News
News December 8, 2025
పెద్దపల్లి: సాంబార్ గిన్నెలో పడి బాలుడి మృతి

పెద్దపల్లి(D) ధర్మారం(M) మల్లాపూర్ TGSW బాలికల పాఠశాలలో వంటమనిషి మొగిలి మధుకర్ కొడుకు మోక్షిత్(4) ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు వంటగదిలో ఉన్న వేడి సాంబార్ గిన్నెలో పడ్డాడు. తండ్రి మధుకర్ గమనించి మోక్షిత్‌ను KNR హాస్పిటల్, అక్కడి నుంచి వరంగల్ MGM తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోక్షిత్ మరణించాడు. తండ్రి మధుకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 8, 2025
పెరిగిపోతున్న సోషల్ మీడియా ముప్పు

చర్మ సౌందర్యానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి చాలామంది మహిళలు సమస్యల్లో పడుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 20- 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 78% మంది ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కనిపించే “మిరాకిల్ ట్రీట్మెంట్”ల నమ్మకంతో నకిలీ స్కిన్ సెంటర్లకు వెళ్తున్నారు. అక్కడ అనుభవం లేనివారితో ట్రీట్మెంట్లు చేయించుకొని చర్మానికి నష్టం కలిగించుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
News December 8, 2025
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాం: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని CM చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్న తమ మాటలను నమ్మి ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు. 18 నెలలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు. పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచగలిగామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.


