News September 12, 2025
పల్నాడు జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా కృతిక శుక్ల

పల్నాడు జిల్లాకు తొలి మహిళా కలెక్టర్‌గా కృతిక శుక్లా నియమితులయ్యారు. గతంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆమె పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలో దిశ పర్యవేక్షణ ప్రత్యేక అధికారిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు.
Similar News
News December 13, 2025
విశాఖ: టెట్ పరీక్షకు 311 మంది గైర్హాజరు

విశాఖలో శనివారం 17 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 4,501 మంది అభ్యర్థులకు గానూ 4,190 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. డీఈవో ప్రేమ్ కుమార్ ఒక పరీక్ష కేంద్రాన్ని.. ఫ్లైయింగ్ స్క్వాడ్ 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.
News December 13, 2025
ఈనెల 15న యథావిధిగా PGRS: కలెక్టర్

డిసెంబర్ 15 సోమవారం జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అర్జీదారులు తమ వినతులను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News December 13, 2025
పొగ మంచులో ప్రయాణం.. ప్రమాదకరం: ASF ఎస్పీ

పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం అని, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని, పరిమిత వేగంతో వెళ్లాలని ASF ఎస్పీ నితిక పంత్ అన్నారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరి, పొగమంచు దట్టంగా కమ్ముకొని రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా వాహనాలు నడపాలన్నారు.


