News August 13, 2025

పల్నాడు జిల్లా ప్రజలకు గమనిక

image

అల్ప‌పీడ‌నం కారణంగా రానున్న మూడు రోజులు పల్నాడు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని క‌లెక్ట‌ర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్తలు తీసుకోవాల‌ని ఆదేశించారు. జిల్లా స్థాయిలో 08647252999తో కంట్రోల్ రూము ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా కాల్ చేయాలని సూచించారు.

Similar News

News March 9, 2026

విమానాశ్రయం ద్వారా నేడు ఎంతమంది ప్రయాణించారంటే..!

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా సోమవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 1,836 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 2,111 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.

News March 9, 2026

HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

image

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News March 9, 2026

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ మాకవరపాలెంలో పరిశ్రమలు ఏర్పాటుకు 4259 ఎకరాల భూమి సేకరణకు స్థల పరిశీలన
➤ గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష
➤ బాలుడి మృతికి నాటు తుపాకీ పేలుడే కారణం
➤ అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు: ఎస్పీ
➤ పుత్తడి గైరంపేటలో గుండెపోటుతో యువకుడు మృతి
➤ శృంగవరంలో పర్యటించిన కేంద్ర బృందం
➤ ఎరకన్నపాలెం టూ పెద్దపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు
➤PGRS లో ఫిర్యాదుల వెల్లువ