News February 9, 2025
పల్నాడు ప్రమాదంపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి

పల్నాడు జిల్లా ముప్పాళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Similar News
News March 27, 2025
పోక్సో కేసు నిందితులపై రౌడీ షీట్: హోంమంత్రి అనిత

AP: రాష్ట్రంలో పోక్సో కేసు నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన 509 CC కెమెరాలను ప్రారంభించిన అనంతరం హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
News March 27, 2025
భారత్‌కు పుతిన్: పర్యటనను ఖరారు చేసిన రష్యా

ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనను రష్యా ఖరారు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన త్వరలోనే ఇక్కడికి వస్తారని తెలిపింది. ‘భారత్‌లో పుతిన్ పర్యటనకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు’ అని రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్‌రోవ్ ప్రకటించారు. టైమ్‌లైన్‌ను మాత్రం వెల్లడించలేదు. మోదీ మూడోసారి అధికారంలోకి రాగానే రష్యాకే వెళ్లిన సంగతి తెలిసిందే.
News March 27, 2025
విశాఖ మేయర్ పీఠంపై ‘యాదవుల’ పట్టు..!

జీవీఎంసీ మేయర్‌గా గొలగాని హరి వెంకట కుమారిని కొనసాగించాలని విశాఖ జిల్లా యాదవ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, ఆ స్థానాన్ని యాదవులకే ఇవ్వాలన్నారు. జీవీఎంసీలో 22 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నారన్నారు. ఏ సామాజిక వర్గంలో ఇంత మంది కౌన్సలర్లు లేరని గుర్తుచేశారు.