News September 11, 2025

పల్నాడు: భళారే చిత్రం.. పైన జలాశయం కింద రోడ్డు బ్రిడ్జి

image

పైన జలాశయం, కింద రోడ్డు ఉన్న ఒక విలక్షణమైన వంతెన మాచర్ల-జమ్మలమడక మార్గంలో ఉంది. ఈ వంతెన బొంబాయికి చెందిన ఒక నిర్మాణ సంస్థ నిర్మించడం వలన దీనిని ‘బొంబాయి బ్రిడ్జి’ అని పిలుస్తారు. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు విడుదలైనప్పుడు ఈ వంతెనపై నుంచి ప్రవహిస్తుంది. వంతెన కింద రోడ్డు ఉండటం వలన ఈ ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన వంతెన ప్రయాణికులను విశేషంగా ఆకర్షిస్తుంది.

Similar News

News December 17, 2025

MBNR జిల్లాలో 81.44 శాతం ఓటింగ్.. లెక్కింపు ప్రారంభం

image

MBNR జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లా వ్యాప్తంగా 81.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,16,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ముగిశాయి. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సా.5 గంటల వరకు ఫలితాలు వెలువడనున్నాయి.

News December 17, 2025

NZB: ఒంటి గంట అప్‌డేట్ 74.36 శాతం పోలింగ్

image

తుది దశ GP ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 12 మండలాల్లోని 165 GPల్లో 146 SPలకు, 1130 WM లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. ఆలూర్ 75.37%, ఆర్మూర్-74%, బాల్కొండ-63.25%, భీమ్‌గల్-73.18%, డొంకేశ్వర్-77.39%, కమ్మర్పల్లి-72.85%, మెండోరా-76.29%, మోర్తాడ్-75.87%, ముప్కాల్-76.61%, నందిపేట్-78.04%, వేల్పూర్-75.01%, ఏర్గట్ల-75.92% పోలింగ్ నమోదైనట్లు వివరించారు.

News December 17, 2025

సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మార్పు

image

TG: రాష్ట్రంలో నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 20న కాకుండా 22వ తేదీకి అపాయింటెడ్ డేను మారుస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 20న సరైన ముహూర్తాలు లేవని, తేదీని మార్చాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త సర్పంచులందరూ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.