News November 17, 2025
పల్నాడు మహిళా పౌరుష స్ఫూర్తి.. మగువ మాంచాల

పల్నాడు మహిళల్లో నేడు కనిపిస్తున్న పౌరుషం, ఆత్మగౌరవానికి ప్రతీకగా మగువ మాంచాలని భావిస్తారు. నాటి పల్నాటి యుద్ధంలో మాచర్ల మహామంత్రి బ్రహ్మనాయుడు కోడలిగా, మహావీరుడు బాలచంద్రుడు భార్యగా ఆమె పాత్ర కీలకమైంది. ఆత్మాభిమానం గల మహిళగా ఆమె తన భర్త బాలచంద్రుడికి వీర తిలకం దిద్ది కథన రంగానికి పంపింది. యుద్ధంలో వీరోచితంగా పోరాడి బాలచంద్రుడు అసువులు బాసినప్పటికీ ఆమె చూపిన తెగువ నేటికీ కీర్తించబడుతోంది.
Similar News
News January 13, 2026
మిగిలిన భోగి పళ్లను ఏం చేయాలి?

భోగి పళ్లు పోసిన తర్వాత కింద పడిన పళ్లను పిల్లలు ఏరుకుంటారు. ఆ తర్వాత మిగిలిపోయిన పళ్లను బయట పడేయకూడదు. వాటిని శుభ్రం గోమాతలకు పెట్టడం వల్ల శుభం కలుగుతుంది. ఇతర మూగజీవాలకు ఆహారంగా వేయడం కూడా చాలా మంచిది. ఇలా చేస్తే పళ్లు వృధా కాకుండా ఉండటమే కాకుండా, పశువులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న మన సంప్రదాయాల్లో జీవ కారుణ్యం కూడా భాగమని చెప్పడానికి ఇదో నిదర్శనం.
News January 13, 2026
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ శ్రావణి

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కోడి పందేలు, గుళ్ల ఆటలపై నిషేధం ఉందన్నారు. వాటి జోలికి దూరంగా ఉండాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 13, 2026
MDK: ఆపరేషన్ స్మైల్.. అమ్మనాన్న మీ దగ్గరికి వచ్చేశా!

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా మెదక్ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి జరుగుతోందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. 10 రోజుల్లో 26 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించగా, 9 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.


