News November 7, 2025

పల్నాడు యుద్ధం ఎందుకు జరిగింది..!

image

పల్నాటి యుద్ధానికి దాయాదుల రాజ్యాధికార పోరు ప్రధాన కారణమని చరిత్రకారులు పేర్కొన్నారు. నలగామరాజు, మలిదేవరాజు మధ్య కోడిపందేలు జరిగాయి. ఓడిన మలిదేవరాజు ఏడేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత కూడా రాజ్యం ఇవ్వకపోవడం, రాయబారి హత్యతో ఈ భీకర సంగ్రామం మొదలైందని చెబుతుంటారు. దీనికి అదనంగా వైష్ణవ సంస్కర్త బ్రహ్మనాయుడు, శైవ సంప్రదాయవాది నాయకురాలు నాగమ్మల మధ్య మత, సామాజిక వైరుధ్యాలు తోడయ్యాయని పేర్కొన్నారు.

Similar News

News January 19, 2026

నాకు పెళ్లి కాలేదు: డింపుల్ హయాతి

image

తనకు పెళ్లి అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ డింపుల్ హయాతి ఖండించారు. ‘ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది’ అని ఓ నెటిజన్ SMలో కామెంట్ చేయగా ‘నాకు పెళ్లి కాలేదు’ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు. డింపుల్, ఆమె భర్త డేవిడ్‌పై పోలీస్ కేసు నమోదైందంటూ సదరు నెటిజన్ ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేయగా అది ఫేక్ అని ఆమె బదులిచ్చారు. కాగా డింపుల్ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది.

News January 19, 2026

హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్.. ‘పబ్బుల్లో పాఠాలు’

image

సిటీ కుర్రాళ్ల సోషల్ లైఫ్ ఇప్పుడు రూటు మార్చింది. వీకెండ్ వస్తే కేవలం డాన్స్ ఫ్లోర్ల మీద స్టెప్పులేయడమే కాదు.. చేతిలో బీర్ గ్లాసు పట్టుకొని ‘స్ట్రింగ్ థియరీ’ వంటి కఠినమైన సైన్స్ ముచ్చట్లు వినడం ఇప్పుడు GEN-Zలో కొత్త క్రేజ్. ‘పింట్ ఆఫ్ వ్యూ’ వంటి ఈవెంట్లే దీనికి సాక్ష్యం. సైన్స్, హిస్టరీ, క్వాంటం ఫిజిక్స్ వంటి సీరియస్ విషయాలను చిల్ అవుతూ నేర్చుకోవడానికి మన HYD కుర్రాళ్లు బాగా ఇష్టపడుతున్నారు.

News January 19, 2026

నారాయణపేట: ‘వేసవిలో తాగునీటి ఎద్దడి రానీయొద్దు’

image

NRPT జిల్లాలో వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ నీరు అందేలా చూడాలని, నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.