News November 19, 2025

పల్నాడు: సీసీఐ నిబంధనలతో తిరస్కరణ..!

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 10 రోజులు దాటినా ఒక్క కొనుగోలు కూడా జరగలేదు. తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండాలనే సీసీఐ (CCI) నిబంధనలతో బయ్యర్లు ప్రతి పంటను తిరస్కరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు ధర దక్కక, చేసేది లేక దళారులను ఆశ్రయించక తప్పడం లేదని వాపోతున్నారు.

Similar News

News January 20, 2026

ఖమ్మం: ఇంటర్ పరీక్షలకు సిద్ధం.. 66 కేంద్రాల ఏర్పాటు

image

ఖమ్మం జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 35,188 మంది విద్యార్థుల కోసం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షించి, కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు DIEO రవిబాబు తెలిపారు.

News January 20, 2026

బాపట్ల జిల్లాకు కొత్త ప్రాజెక్ట్.!

image

మార్టూరు మండలం వలపర్లలో రూ.198 కోట్లతో సోలార్ సెల్ మాడ్యులర్ యూనిట్‌ను ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించనుందని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. మార్టూరు మండలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. ప్రాజెక్ట్ ఏర్పాటుతో 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

News January 20, 2026

లింగంపేట: ఏడాదిలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

image

లింగంపేటకు చెందిన యాదగిరి పలువురు నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒకే ఏడాదిలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గతంలో గ్రూప్-4 ఉద్యోగం సాధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే ఇటీవల విడుదల చేసిన గ్రూప్-3 ఫలితాల్లో జిల్లా ట్రెజరీ శాఖలో సీనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగం సాధించి ఆర్డర్ కాపీ అందుకున్నారు.