News March 7, 2025
పల్నాడు: 32 ఏళ్ల క్రితం ఇదే రోజున దారుణ ఘటన

32 ఏళ్ల క్రితం ఇదే రోజున నరసరావుపేటలో 23 మందిని చంపేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. 1993 మార్చి 7న HYD-CH.పేట వస్తున్న బస్సులో నరసరావుపేట రైల్వే క్రాసింగ్ వద్ద చలపతిరావు, విజయవర్ధన్‌రావు అనే ఇద్దరు ఎక్కారు. ప్రయాణికులను బెదిరించి నగదు దోచుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది పారిపోయేందుకు ప్రయత్నించగా బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు.
Similar News
News December 15, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో, మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా Meekosam వెబ్‌సైట్‌లో సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 15, 2025
అనకాపల్లి: ‘మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్’

మహిళ ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ జీవో సంక్రాంతి లోగా జారీ అయ్యేవిధంగా కృషి చేస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు హామీ ఇచ్చారు. ఆదివారం కశింకోట శారదా వనంలో పీఆర్టీయూ నిర్వహించిన వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. పదో తరగతి వంద రోజుల ప్రణాళికలో సెలవులను మినహాయించాలని సూచించారు. సీపీఎస్ రద్దుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ పాల్గొన్నారు.
News December 15, 2025
అమలాపురం: నేడు PGRS కార్యక్రమం

అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్ కేంద్రాల్లోని ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.


