News April 4, 2024
పవన్ అలా చెప్పడం బాధాకరం: ముద్రగడ

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, మైనార్టీ పెద్దలు గురువారం కిర్లంపూడిలో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను కలిశారు. సీఎం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలనే అమలు చేస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ గెలిస్తే నాణ్యమైన బ్రాందీని అందిస్తానని పవన్ అనడం బాధాకరమన్నారు. బౌన్సర్లతో ప్రచారం చేసే పవన్ ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటారని ప్రశ్నించారు.
Similar News
News February 15, 2026
రాజమండ్రి: గమనిక.. రేపు రెవెన్యూ క్లినిక్‌లు రద్దు

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తదుపరి రోజూ 16న రాష్ట్ర ప్రభుత్వం ఐచ్చిక సెలవు ప్రకటించిన దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన PGRS/ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు అందజేయడానికి సంబంధిత కార్యాలయాలకు రావద్దని అర్జీదారులను కోరారు. తదుపరి సోమవారం నుండి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.
News February 14, 2026
ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: కందుల

సీఎం నారా చంద్రబాబు దిశానిర్దేశంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక బడ్జెట్ రాష్ట్ర పురోగతికి బాటలు వేసేలా ఉందని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. శనివారం అమరావతిలో ఆయన మాట్లాడారు. పర్యాటక, సాంస్కృతిక రంగాలకు బడ్జెట్‌లో రూ.439 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది సమగ్రమైన బడ్జెట్ అని రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి పురోగమన దిశలో వెళ్తుందన్నారు.
News February 13, 2026
తూ.గో జిల్లాలో ఈనెల 17న డీ-వార్మింగ్ డే- డీఎంహెచ్‌ఓ

తూర్పుగోదావరి జిల్లాలోని అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ నెల 17న జాతీయ డీ-వార్మింగ్ డే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ రోజు మాత్రలు వేసుకోలేని వారి కోసం 24న ‘మాప్-అప్ డే’ ఏర్పాటు చేశామన్నారు. వయసును బట్టి ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని, పిల్లలకు ఆహారం తిన్న తర్వాతే వీటిని వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


