News October 5, 2025
పవన్ కళ్యాణ్ దృష్టికి రాజోలు సమస్యలు

రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. శనివారం సాయంత్రం జనసేన అధినేతతో జరిగిన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ఆయన ఈ విషయం ప్రస్తావించారు. శంకరగుప్తం డ్రెయిన్‌ను పరిశీలించాలని పవన్ కళ్యాణ్‌ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెలలోనే ఆయన ముంపు సమస్య పరిశీలనకు నియోజకవర్గానికి వస్తారని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ(BA, B.Com, BSc, BSW), MA, MSW, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 26 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, డెమాన్‌స్ట్రేషన్/ప్రజెంటేషన్(ఫ్యాకల్టీ), ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianbank.bank.in
News January 24, 2026
మనాలిపై మంచు దుప్పటి..

హిమాచల్‌ప్రదేశ్ మనాలిలో మంచు దట్టంగా కురుస్తోంది. మంచు తీవ్రతకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతకు ప్రజలు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా మంచు కురుస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 3రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. SAT రాత్రి టెంపరేచర్లు ‘-3’ డిగ్రీలుగా నమోదుకావొచ్చని, 10-15KMల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు.
News January 24, 2026
కామారెడ్డి: 28న 50 మంది విద్యార్థులకు శ్రీహరికోట పర్యటన

కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పర్యటన ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గత ఏడాది OCTలో నిర్వహించిన ఎంపిక పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన 50 మంది పదో తరగతి విద్యార్థినులతో పాటు 30 మంది టీచర్లను ఈనెల 28న నెల్లూరు(D) శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ పర్యటనకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.


