News December 9, 2025

పవన్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ ఏమన్నారంటే?

image

AP: Dy.CM పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలోనే అన్నారని, ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని తెలిపారు. పవన్‌కు TG ప్రజలపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. ఆ మాటలపై అనవసర రాద్దాంతం చేశారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేయగా, మరో మంత్రి కందుల దుర్గేశ్ సైతం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News January 19, 2026

CBN వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు: మంత్రి లోకేశ్

image

AP: ఏడాదిన్నరలో రాష్ట్రానికి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటివల్ల 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలొస్తాయని దావోస్‌లో మంత్రి లోకేశ్ తెలిపారు. అభివృద్ధి, ఐటీ, క్వాంటమ్ అంటూ ఏపీని సీబీఎన్ నడిపిస్తున్నారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారంటే ఆయనే కారణమన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 11 మంది ఏడుపుగొట్టు టీమ్ పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోందని పరోక్షంగా వైసీపీని విమర్శించారు.

News January 19, 2026

ఇతిహాసాలు క్విజ్ – 128 సమాధానం

image

ప్రశ్న: అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలిసినా, బయటకు రావడం ఎందుకు తెలియదు?
సమాధానం: అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానం గురించి వివరిస్తుంటే విన్నాడు. అయితే, వ్యూహం నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రపోయింది. దీంతో గర్భంలో ఉన్న అభిమన్యుడికి లోపలికి వెళ్లడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 19, 2026

భారత పర్యటనలో UAE అధ్యక్షుడు

image

UAE అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కారులో ప్రయాణించారు. నహ్యాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు.