News December 2, 2025

పవన్ సారీ చెబుతారా?

image

కోనసీమకు <<18446578>>దిష్టి<<>> తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పలువురు తెలంగాణ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పవన్‌ను బహిరంగంగానే తప్పు పడుతూ వెంటనే సారీ చెప్పాలని మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు BRS నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనా కాస్త ఆలోచించి మాట్లాడి ఉండాల్సిందని మరికొందరు అంటున్నారు. దీనిపై పవన్ సారీ చెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Similar News

News February 12, 2026

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్!

image

ఎయిర్‌ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా భారత్ రూ.3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు రాజ్‌నాథ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇండియాకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సమాచారం. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫేల్ సత్తా చాటిన విషయం తెలిసిందే.

News February 12, 2026

కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ వరుస భేటీలు

image

ఢిల్లీ పర్యటనలో CM రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని రామ్మోహన్ నాయుడును కోరారు. కొత్తగూడెం, అంతర్గాం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి చర్చలు జరిపారు. అశ్వినీ వైష్ణవ్, రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ CM సమావేశమయ్యారు. ఈనెల చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు కావాలని రాజ్‌నాథ్‌ను ఆహ్వానించారు.

News February 12, 2026

దోసలో బోరాన్ లోప లక్షణాలను ఇలా గుర్తించండి

image

దోస పంటలో బోరాన్ లోపం వల్ల ఆకులు మందంగా మారతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి, ఆకులు చిన్నవిగా, ముడుచుకొని, పసుపు రంగులో కనిపిస్తాయి. ఎదిగే లేత కొనలు ఎండిపోతాయి. ఆడ పువ్వుల సంఖ్య తగ్గి మగ పువ్వుల సంఖ్య పెరుగుతుంది. కాయ లోపలి భాగం లేత పసుపురంగులోకి మారుతుంది. కాయలపైన తొక్క దళసరిగా మందంగా మారడంతో పాటు బొడిపెలు కనిపిస్తాయి. బోరాన్ లోప ఉద్ధృతి ఎక్కువైతే కాయలు నిలువుగా పగులుతాయి.