News November 19, 2025

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>పవర్‌గ్రిడ్ <<>>కార్పొరేషన్‌లో 7 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. LLB/LLM ఉత్తీర్ణులైనవారు DEC 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CLAT-2026లో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

Similar News

News January 14, 2026

RCPM: గబ్బర్ సింగ్ గెటప్‌లో మంత్రి సుభాష్ కటౌట్

image

రామచంద్రపురం VSM కాలేజీ గ్రౌండ్‌లో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో కోనసీమ సంక్రాంతి సంబరాలు మంగళవారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. స్వాగత ద్వారం వద్ద ఏర్పాటు చేసిన మంత్రి కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కటౌట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ గెటప్‌ను పోలి ఉందంటూ వీక్షకులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News January 14, 2026

ప్యాసింజర్ వెహికల్స్‌కు పెరుగుతున్న డిమాండ్

image

కార్లు, ఆటోలు వంటి ప్యాసింజర్ వెహికల్స్‌కు ఏటా డిమాండ్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే 2025 DECలో కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన వాహనాలు 27% పెరిగాయని SIAM పేర్కొంది. ‘ప్యాసింజర్ వెహికల్స్ గతనెలలో 3,99,216 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 DECతో పోలిస్తే 26.8% ఇవి అధికం. టూవీలర్స్‌ డిస్పాచ్ కూడా 39% పెరిగింది. 2025 DECలో ఇవి 15,41,036 యూనిట్లు సరఫరా కాగా 2024 ఇదే నెలలో 11,05,565 వెళ్లాయి’ అని తెలిపింది.

News January 14, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.