News January 18, 2026
పశువుల రవాణా.. ఈ సర్టిఫికెట్స్ తప్పక ఉండాలి

పశువులను ఒక ప్రాంతంలో కొని మరో ప్రాంతానికి తరలించేటప్పుడు కొన్ని సర్టిఫికెట్స్‌ను మన దగ్గర ఉంచుకొని సంబంధిత అధికారులు అడిగితే చూపాలి. జీవాల కొనుగోలు, అమ్మకం రసీదు, జీవాల వయసు, ఆరోగ్యం, వాటి విలువ తెలియజేసే సర్టిఫికెట్‌ను కొనుగోలు చేసిన ప్రాంత పశువైద్యాధికారి నుంచి తీసుకోవాలి. పశువులను ఏ వాహనంలో ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎవరికి రవాణా చేస్తున్నారో తెలిపే రవాణా సర్టిఫికెట్‌ను కూడా మన దగ్గర ఉంచుకోవాలి.
Similar News
News February 18, 2026
చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP

AP: మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో SMలో TDP ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 2018 దాచేపల్లి నుంచి నేటి మదనపల్లె ఘటన వరకు ఆడబిడ్డల జోలికి వెళ్లిన నిందితులు వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. నేరం చేస్తే చంద్రబాబు వదిలిపెట్టరనే భయమే వారిని వెంటాడిందని, అందుకే ప్రాణాలు తీసుకున్నారని రాసుకొచ్చింది.
News February 18, 2026
T20 ర్యాంకింగ్స్.. టాప్-10లోకి ఇషాన్

ఐసీసీ ప్రకటించిన తాజా టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా నుంచి నలుగురు బ్యాటర్లు టాప్-10లో ఉన్నారు. నంబర్ 1 స్థానంలో అభిషేక్ శర్మ కొనసాగుతుండగా తిలక్ 4, సూర్య 6, ఇషాన్ కిషన్ 8వ స్థానాల్లో నిలిచారు. టీ20 WCలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడంతో ఇషాన్ ర్యాంకింగ్ మెరుగుపడింది. టీ20 ఆల్‌రౌండర్లలో హార్దిక్ 3, దూబే 9వ స్థానంలో, బౌలర్లలో వరుణ్ చక్రవర్తి తొలి స్థానంలో ఉన్నారు.
News February 18, 2026
జుట్టు పొడిబారకుండా ఉండాలంటే?

పొడిబారి ఉన్న కురులకు గాఢత తక్కువగా, తేమను పెంచే షాంపూలను ఎంచుకోవాలి. పొడి జుట్టు ఉన్నవారు సల్ఫేట్ ఫ్రీ ఫార్ములాతో ఉన్న మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంచుకోవాలి. తేమను నిలిపే హైలురోనిక్ యాసిడ్, స్క్వాలేన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. తలస్నానం చేశాక కండిషనర్ తప్పనిసరిగా రాసుకోవాలి. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి పోషకాల లేమి ఏమైనా ఉంటే… సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది.


