News December 9, 2025

పశ్చిమ ప్రకాశం వాసులకు తీరనున్న ప్రయాణ కష్టాలు

image

ఏపీ ప్రభుత్వం మార్కాపురం జిల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే యర్రగొండపాలెం (135 km), మార్కాపురం (98 km), కనిగిరి (92 km)కి దూరం ప్రయాణించాల్సి వచ్చేదని పశ్చిమ ప్రకాశం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నూతన మార్కాపురం జిల్లాలో కలిపిన నియోజకవర్గాలకు జిల్లా కేంద్రం 65(km)లోపే ఉంటుంది. గిద్దలూరుకు మాత్రం ఒంగోలుతో పోల్చుకుంటే మార్కాపురం దగ్గరే.

Similar News

News January 23, 2026

కందుకూరు LICలో రూ.3 కోట్ల స్కాం.!

image

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.3 కోట్లు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం గుట్టు రట్టయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 23, 2026

ప్రకాశం: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19నుంచి అమల్లోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.

News January 23, 2026

ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..!

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.