News April 23, 2025
పహల్గామ్‌లో ఉగ్రదాడి.. MLC కవిత దిగ్భ్రాంతి

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై MLC కవిత తీవ్ర దిగ్భ్రాంతికి చెందారు. అమాయక పర్యాటకులపై జరిగిన క్రూరమైన దాడితో తీవ్ర భయాందోళనకు గురయ్యారన్నారు. ఈ దుర్ఘటనలో బాధితుల కోసం తమ హృదయాలు విలపిస్తున్నాయన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కవిత ‘X’లో పోస్ట్ చేశారు.
Similar News
News March 16, 2026
తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకు కేడీసీసీబీ బ్యాంక్

కరీంనగర్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏటా వంద కోట్ల లాభలతో ప్రభుత్వ ప్రధాన బ్యాంకులకు ధీటుగా సేవలు అందిస్తూ తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకి ఎంపికైనట్లు సీఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ ఆవార్డును 17వ తేదిన సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందని, ఇది అందరి సమిష్టి విజయం అని తెలిపారు.
News March 16, 2026
మెదక్: తీవ్ర విషాదం.. పరీక్షకు వెళ్తూ మృతి

మనోహరాబాద్ మండలంలో ఆదివారం <<19387134>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఓ కంటైనర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఇమాంపూర్ వాసి నిఖిల్(20) అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు మన్నె స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు బైక్‌పై ఉప్పల్‌లో పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 16, 2026
INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.


