News September 10, 2025

పాక్ జాతీయుడిని స్వదేశానికి పంపిన హైదరాబాద్ పోలీసులు

image

చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు. మహ్మద్ ఉస్మాన్(48) అనే వ్యక్తి నేపాల్ మీదుగా 2011లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌లో నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇతడిని సెప్టెంబర్ 9న అటారీ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్‌కు అప్పగించారు.

Similar News

News December 12, 2025

రంగారెడ్డి జిల్లా: 7 మండలాల్లో కాంగ్రెస్ vs BRS

image

రంగారెడ్డి జిల్లాలో 1stవిడత సర్పంచ్ ఎలక్షన్స్‌లో BRS, కాంగ్రెస్ పోటీ పడ్డాయి.
☛ శంషాబాద్‌: 21 GPలకు కాంగ్రెస్ 12, BRS 3, BJP 2
☛ ఫరూక్‌నగర్: 47GPలకు కాంగ్రెస్ 28, BRS 18
☛ చౌదరిగూడ: 24GPలకు, కాంగ్రెస్ 13, BRS 11
☛ కేశంపేట్: 29లకు, కాంగ్రెస్ 15, BRS 13
☛ కొందుర్గు: 22GPలకు, కాంగ్రెస్ 13, BRS8, BJP 1
☛ నందిగామ: 19GPలకు కాంగ్రెస్ 6, BRS 12
☛ కొత్తూరు: 12GPలకు, కాంగ్రెస్ 9, BRS 3 సర్పంచ్‌లు గెలిచాయి.

సేఫ్ HYD కోసం చెరువులు కాపాడుకోండి: రంగనాథ్

image

సేఫ్ HYD కోసం చెరువులు కాపాడుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రకృతి పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణకు ‘CSR’ చేయూత అవసరమని ఆయన ఆకాంక్షించారు. నగరంలో వరదలను నియంత్రించడానికి ఇప్పటికే 6 చెరువుల అభివృద్ధి చేపట్టామని, మరో 14 చెరువులు పునరుద్ధరించనున్నామని స్పష్టంచేశారు. అలాగే నాలా ఆక్రమణలు తొలగించడం, డ్రైన్లలో పూడిక తీయడంతో ఈ ఏడాది వరద ముప్పును చాలా ప్రాంతాల్లో తగ్గించగలిగామని ఆయన వివరించారు.