News November 19, 2025

పాఠశాల్లో కూడా ముస్తాబును నిర్వహించాలి: కలెక్టర్

image

విద్యార్థుల ముస్తాబు కార్యక్రమం మాదిరిగా ఇకపై పాఠశాలల ముస్తాబు కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం GJ కళాశాల సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రధానోపాధ్యాయులతో జిల్లా స్థాయి సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ప్రతి పాఠశాలలో దీన్ని ఖచ్చితంగా ఆచరించాలని, పాఠశాల ప్రాంగణంలో చెత్త లేకుండా పరిశుభ్ర వాతావరణం కనిపించాలన్నారు.

Similar News

News January 12, 2026

విమానాశ్రయం భూములను పరిశీలించిన ప్రకాశం కలెక్టర్

image

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పో‌ర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్‌తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పో‌ర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.

News January 12, 2026

వీఎన్ పల్లె తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు

image

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వీఎన్ పల్లె తహశీల్దార్ లక్ష్మీదేవితో పాటు మరో 11 మందికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీలోగా గ్రామసభల ద్వారా రైతులకు పుస్తకాలు అందజేయాలని ఆదేశించినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News January 12, 2026

ప్రకాశం SP ‘మీకోసం’కు 58 ఫిర్యాదులు

image

ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం SP మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో ఈ కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. SP కార్యాలయం ఈ వివరాలను ప్రకటించింది.