News August 13, 2025
పాఠశాల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి: నంద్యాల కలెక్టర్

పాఠశాల విద్య అభివృద్ధి రాష్ట్ర, దేశ అభివృద్ధికి పునాది అని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి స్కూలింగ్, బిల్డింగ్ బ్లాక్ వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News March 16, 2026
షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు

వంట నూనె ధరలు సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఆన్‌లైన్‌లో సన్‌ఫ్లవర్ గతంలో లీటర్ రూ.152 ఉండగా ఇప్పుడు రూ.174-178కి చేరింది. ఆఫ్‌లైన్‌లో రూ.165-168 మధ్య విక్రయిస్తున్నారు. సన్‌ఫ్లవర్‌కు డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో సూపర్ మార్కెట్లు, కిరాణాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె లీటర్ రూ.220 పైనే విక్రయిస్తున్నారు. గల్ఫ్ యుద్ధం మరో నెల కొనసాగితే నూనె ధరలు మరింత పెరగనున్నాయి.
News March 16, 2026
‘చిన్న కాళేశ్వరం’కు ఈసారైనా మోక్షం లభించేనా?

నేటి నుంచి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి 2026-27 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మన మంథని నియోజకవర్గ ప్రజల చూపు రాష్ట్ర బడ్జెట్‌పై పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న (ముక్తేశ్వర) ఎత్తిపోతలకు ఈ బడ్జెట్లోనైనా నిధుల మోక్షం లభిస్తుందా? లేదా గత బడ్జెట్ల మాదిరిగానే మొండిచేయి చూపుతారా? అనే ఆందోళన నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది.
News March 16, 2026
సిద్దిపేట: విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు:కలెక్టర్

సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, బీసీ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలికల భద్రత విషయంలో రాజీ పడొద్దని, కామన్ డైట్ మెనూ పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని వార్డెన్లను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.


