News April 12, 2025
పాఠ్యాంశంగా వనజీవి జీవితం

<<16071045>>వనజీవి రామయ్య<<>> అసలు పేరు దరిపల్లి రామయ్య. కోటి మొక్కలకు పైగా నాటడంతో వనజీవి రామయ్యగా మారిపోయారు. 50 ఏళ్లుగా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచుతూ ఆయన ఎందరికో ఆదర్శంగా మారారు. అయితే ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. వనజీవి గురించి పిల్లలకు తెలియాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా వనజీవి గురించి పిల్లలకు బోధిస్తోంది.
Similar News
News April 18, 2026
ఖమ్మం: వానాకాలం సాగుకు విత్తనాలు సిద్ధం

ఖమ్మంలో వానకాలం సాగుకు సంబంధించి విత్తనాల సరఫరాపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకుని 30 వేల క్వింటాళ్ల విత్తనాల సరఫరా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. వరితో పాటు పెసర, మినుము, కంది విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
News April 18, 2026
ఒకేషనల్ విద్యార్థులకు క్లినికల్ శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ MPHW(F), MLT ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఏడాది పాటు క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు తెలిపారు. తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రుల్లో 30 మంది చొప్పున, వైరాలో 10 మందికి అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల వారు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు
News April 17, 2026
ఖమ్మం: బియ్యం అక్రమ రవాణాదారుపై పీడీ యాక్ట్

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆత్మకూరి జగదీష్‌పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీపీ సునీల్ దత్ శుక్రవారం తెలిపారు. నిందితుడిపై ఖమ్మంలో 13 కేసులతో పాటు ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయని, అతడిని చంచలగూడ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.


