News March 6, 2025
పాడేరు: ఈనెల 7నుంచి యథావిధిగా మీకోసం కార్యక్రమం

ఈనెల 7వ తేదీ శుక్రవారం నుంచి పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అల్లూరి దినేశ్ కుమార్ బుధవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే ఎన్నికలు పూర్తి కావడంతో మీకోసం కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు అందించాలని సూచించారు.
Similar News
News March 19, 2025
కొల్లేరు సరిహద్దులు గుర్తింపు.. వారందరిలో ఆందోళన

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరిహద్దులను గుర్తించే ప్రక్రియను అధికారులు ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఈ సర్వే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. సర్వే పూర్తయి నివేదిక పరిశీలించిన తర్వాత సుప్రీం ఏం చేయబోతుందన్నదనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
News March 19, 2025
ఎస్.అన్నవరం: రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ నేత కుసనం దొరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున తుని రైల్వే స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై ఆయన స్వగ్రామం ఎస్.అన్నవరం వెళుతుండగా కుక్కలు అడ్డురావడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్య ఎస్.అన్నవరంలో ఓ సెగ్మెంట్‌కి ప్రస్తుతం ఎంపీటీసీగా ఉన్నారు.
News March 19, 2025
జగిత్యాల: వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న నలుగురు వివిధ ఘటనల్లో చనిపోయారు. JGTLరూరల్(M) వెల్దుర్తికి చెందిన రాజం(55) అనే <<15808621>>రైతు<<>> అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో గంగాధర(M) ఉప్పరమల్యాలకు చెందిన మల్లేశం(42) చనిపోయాడు. బసంత్‌నగర్‌కు చెందిన ఆరె అజయ్(24) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాపూర్(M) బొమ్మకల్‌లో నీటి సంపులో పడి పజ్ఞాన్ అనే రెండేళ్ల బాలుడు మృతిచెందాడు.