News April 11, 2025

పాడేరు: కలెక్టరేట్‌లో ఫూలే జయంతి కార్యక్రమం

image

మహాత్మా జ్యోతిరావు ఫూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడని కలెక్టర్ దినేశ్ కుమార్ కొనియాడారు. ఫూలే జయంతిని కలెక్టరేట్‌లో  శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.

Similar News

News April 14, 2026

VZM: 26 పరీక్షా కేంద్రాలు.. 8,053 మంది విద్యార్థులు

image

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2026) నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 25న జరిగే పరీక్షకు జిల్లాలో నుంచి 8,053 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

‘B.Ed’ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్!

image

AP: స్టడీ లీవ్ పేరిట ప్రైవేటు కాలేజీల్లో B.Ed, B.P.Ed చదువుతున్న టీచర్ల గురించి ఆరా తీసిన ఉన్నత విద్యామండలి విస్తుపోయే విషయాలు గుర్తించింది. వీరు క్లాసులకు హాజరు కాకుండా హాజరును మేనేజ్ చేసుకుంటున్నారు. ఇతర విద్యార్థులూ ఇలానే ఉన్నట్లు, ఏటా ఇదే తంతు నడుస్తున్నట్లు గమనించింది. ప్రమాణాలు దెబ్బతింటుండడంతో ఇకపై ఈ కాలేజీల్లో విద్యార్థులకు 2పూటలు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్సును అమలుచేయాలని నిర్ణయించింది.